ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ATM Alert: కార్డు స్టక్ అయితే జాగ్రత్త.. ఈ పని చేస్తే అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం!

national |  Suryaa Desk  | Published : Mon, Mar 09, 2026, 09:31 PM

ఏటీఎం కార్డు ఇరుక్కుపోవడానికి కేవలం సాంకేతిక సమస్యలే కాకుండా భద్రతా కారణాలు కూడా ఉండొచ్చు. మీరు ట్రాన్సాక్షన్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడం లేదా వరుసగా తప్పు పిన్ నమోదు చేయడం జరిగితే, భద్రతా చర్యగా మెషీన్ ఆటోమేటిక్‌గా కార్డును హోల్డ్ చేస్తుంది.అలాంటి పరిస్థితుల్లో కార్డును ఎలా బ్లాక్ చేయాలి? కొత్త కార్డు కోసం ఎలా అప్లై చేయాలి? ఇరుక్కుపోయిన పాత కార్డును తిరిగి పొందే అవకాశం ఉందా? అనే విషయాలపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
1. కంగారు పడొద్దు – ముందుగా మెషీన్ వివరాలు నోట్ చేసుకోండి:కార్డు బయటకు రాకపోతే వెంటనే ఆందోళన చెందకుండా ఉండాలి. మెషీన్‌ను లాగడం లేదా కొట్టడం వంటి చర్యలు చేయకండి. ముందుగా ఏటీఎం మెషీన్‌పై కనిపించే ATM ID నంబర్, బ్యాంక్ పేరు, స్థానం, సమయం వంటి వివరాలను రాసుకోవాలి లేదా ఫోటో తీసుకోవాలి.
2. వెంటనే కస్టమర్ కేర్‌కు సమాచారం ఇవ్వండి:మీ బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేయండి. అలాగే కార్డును వెంటనే ‘హాట్‌లిస్ట్’ లేదా బ్లాక్ చేయమని కోరండి. ఇలా చేస్తే ఆ కార్డు ద్వారా ఎవరూ డబ్బులు తీసే అవకాశం ఉండదు.
3. అవసరమైతే కార్డును రద్దు చేయండి : కార్డు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అనిపిస్తే, దానిని పూర్తిగా రద్దు చేయడం మంచిది. ఫోన్ కాల్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా 7 నుంచి 10 పని దినాల్లో కొత్త కార్డు మీ చిరునామాకు చేరుతుంది.
4. పాత కార్డును తిరిగి పొందే విధానం:ఒకవేళ మీరు కార్డును రద్దు చేయకూడదనుకుంటే, అది మీ బ్యాంక్‌కు చెందిన ఏటీఎం అయితే సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. మెయింటెనెన్స్ సిబ్బంది కార్డును తీసి మీ హోమ్ బ్రాంచ్‌కు పంపిస్తారు. తరువాత ఆధార్ లేదా పాన్ కార్డ్ చూపించి దానిని తిరిగి పొందవచ్చు.
5. కార్డు ఇరుక్కుపోవడానికి కారణాలు:సాంకేతిక సమస్యలు: నెట్‌వర్క్ లోపం లేదా పవర్ కట్ కారణంగా.
భద్రతా లాక్: పిన్ నంబర్ పదే పదే తప్పుగా నమోదు చేయడం లేదా ట్రాన్సాక్షన్ మధ్యలో ఎక్కువ సమయం తీసుకోవడం.
-గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఏటీఎం కార్డు ఇరుక్కుపోయినప్పుడు అక్కడ ఉన్న అపరిచితుల సహాయం తీసుకోవడం మానండి. అవసరమైతే బ్యాంక్ అధికారిక కస్టమర్ కేర్ నంబర్‌కే సంప్రదించాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa