ఆనాడు కరోనాని దేశం సమర్థంగా ఎదుర్కొన్నట్లే, దేశంలో ఎల్పీజీ సంక్షోభాన్ని కూడా భారత్ అధిగమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. నెక్స్ట్ సమ్మిట్లో అయన మాట్లాడుతూ... ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా పనిచేస్తోందని తెలిపారు.ప్రపంచంలో నెలకొన్న యుద్ధాల వల్ల భారత పౌరులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మోదీ స్పష్టం చేశారు. ఎల్పీజీ లభ్యతపై అనవసర భయాందోళనలు సృష్టించవద్దని ఆయన కోరారు. నిత్యావసరాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించడం, కృత్రిమ కొరత సృష్టించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకునే అక్రమార్కులపై నిఘా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు.పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతోందని, ఇంధన రంగంలో సవాళ్లను సృష్టిస్తోందని మోదీ అన్నారు. సరఫరా గొలుసులో (సప్లై చైన్) అంతరాయాలను అధిగమించేందుకు ప్రపంచ నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa