ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిఫిన్ తర్వాత టీ తాగితే పోషకాలకు ముప్పు!

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 03:11 PM

చాలామందికి ఉదయాన్నే టిఫిన్ లేదా భోజనం తర్వాత ఒక కప్పు టీ తాగడం అలవాటు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం.. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల ఆహారంలోని ఐరన్ వంటి పోషకాలు శరీరానికి అందవు. టీలో ఉండే టానిన్స్, పాలీఫెనాల్స్ ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. దీనివల్ల రక్తహీనత, అలసట వంటి సమస్యలు తలెత్తవచ్చు. జీర్ణక్రియలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయని, భోజనం తర్వాత కనీసం 45 నిమిషాల నుంచి ఒక గంట విరామం ఇచ్చి టీ తాగడం మంచిదని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa