ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల మార్కును దాటిన నేపథ్యంలో, అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అంతరాయాన్ని తగ్గించేందుకు రష్యా ముడిచమురుపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది.అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మార్చి 12 నాటికి నౌకల్లో లోడ్ చేసి, ప్రస్తుతం సముద్రంలో చిక్కుకుపోయిన రష్యన్ ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఏప్రిల్ 11 అర్ధరాత్రి వరకు ఈ తాత్కాలిక అనుమతి అమల్లో ఉంటుంది. గతంలో భారత్కు ఇచ్చిన ప్రత్యేక వెసులుబాటును ఇప్పుడు ఇతర దేశాలకు కూడా విస్తరించడం గమనార్హం.ఇది కేవలం సరఫరాను గాడిలో పెట్టేందుకు తీసుకున్న స్వల్పకాలిక చర్య మాత్రమేనని, దీనివల్ల రష్యాకు పెద్దగా ఆర్థిక ప్రయోజనం చేకూరదని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా చూసేందుకే ఈ నిర్దిష్టమైన మినహాయింపు ఇచ్చినట్లు ఆయన వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa