నందికొట్కూరు పురపాలక సంఘం పరిధిలోని మార్కెట్లకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి శుక్రవారం తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వారపు సంత, దిన కూరగాయల మార్కెట్, బస్టాండ్ ఫీజులు, జంతు వధశాల, మాంసపు మార్కెట్ హక్కుల కోసం ఈ వేలం జరుగుతుంది. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయం జైకిసాన్ పార్క్‌లో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa