హర్మూజ్ జలసంధి వద్ద 17 భారత ముడి చమురు, LPG, LNG నౌకలు భద్రతా కారణాలతో నిలిచిపోయాయి. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తత కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్లో భారీ పెరుగుదల చూడవచ్చు. దీంతో కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలు, ఇతర దేశాల నుంచి దిగుమతులు పెంపుపై ప్రణాళికలు రూపొందిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa