అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్ అధిరోహించిన పూర్ణ మలావత్‌ను ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ అమెరికా ఆధ్వర్యంలో సన్మానించి సత్కరించారు. ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ అమెరికా శాఖ జాయింట్ సెక్రటరీ సక్రునాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పూర్ణకు ఖరీదైన ల్యాప్‌ట్యాప్‌ను టీఆర్‌ఎస్ అమెరికా శాఖ బహుకరించింది. సక్రునాయక్ మాట్లాడుతూ పూర్ణను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా వారి వారి రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ క్రీడాకారుల ప్రోత్సాహం ఇస్తుందని ఈ నేపథ్యంలో క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారన్నారు. మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్‌లు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగేందర్, దశరథ్, భవానీ, బుచ్చిరెడ్డి, రమేష్ రవ్వ, సురేష్ పన్నా, సాగర్ మలిశెట్టి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa