శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు సోమవారం మధ్యాహ్నం సీఎం వైఎస్. జగన్ తిరుమలకు వచ్చారు. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి నేరుగా తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి నిలయాన్ని ప్రారంభోత్సవం చేసారు. అలాగే సాయంత్రం 4.15గంటలకు ‘అలిపిరి- చెర్లోపల్లె’ జంక్షన్‌లో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. సాయంత్రం 5.15 గంటలకు తిరుమలలోని నందకం అతిథిగృహం వద్ద మాతృశ్రీ వకుళాదేవి యాత్రికుల వసతి సముదాయాన్ని సీఎం జగన్ ప్రారంభించి భక్తులకు అంకితమిచ్చారు. . తిరుమలకు వెళ్లి శ్రీవారికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ శ్రీవారిని దర్శించుకుని రాత్రి 7 గంటలకు వెంకటేశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరంరాత్రి 8 గంటలకు పెద్దశేష వాహన సేవలో పాల్గొన్న ఆయన ఈ రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని విజయవాడకు వెళ్లనున్నారని సిఎంఓ అధికారులు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa