ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియాకు లైసెన్సు ఫీజుల బకాయిలకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రతికూల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై కేంద్రాన్ని ఆశ్రయించాలని ఆ సంస్థ నిర్ణయించుకుంది. వడ్డీలు, పెనాల్టీలు మొదలైనవి తొలగించడం సహా ఊరట చర్యలు తీసుకోవాలని టెలికాం శాఖ (డాట్)ను కోరాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. డాట్ నిర్దేశించిన ఫార్ములా ప్రకారమే టిలికాం కంపెనీలు లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రమ్ ఫీజులు చెల్లించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ.21,000 కోట్లు కట్టాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa