శివసేన ఎమ్మెల్యేలను హొటల్‌కు తరలించారు. నేటి ఉదయం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే నివాసంలో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. వారందరూ సిఎం పదవి రొటేషన్ పద్ధతిలోనే ఉండాలని, ఈ విషయంలో ఉద్ధవ్ థాకరే దృఢచిత్తంతో వ్యవహరించాలని కోరారు. సమావేశం అనంతరం వారు హొటల్‌కు బయలుదేరారు. తమను రంగ్ శారదా హొటల్‌లో ఉండాలని ఆదేశించారని వారన్నారు. ఉద్ధవ్ థాకరే ఏం చెప్పినా దానిని తాము శిరసా వహించి అమలు చేస్తామని వారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa