ఆంధ్రప్రదేశ్‌లో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. విశాఖలోని వైకాపా ప్రధాన కార్యాలయంలో జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామని చెప్పారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa