చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే చివరి నిమిషంలో ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడంతో అది చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే చంద్రయాన్-2 ప్రయోగంలో ప్రాజెక్టు డైరెక్టర్‌గా పని చేసిన ఎం. వనితకు చంద్రయాన్-3 ప్రయోగంలో ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. మిషన్ చంద్రయాన్-3 ప్రాజెక్టుకు కొత్త ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను నియమించినట్లు ఇస్రో వెల్లడించింది.
చంద్రయాన్-3 ప్రయోగానికి తమిళనాడుకు చెందిన పీ. వీరముత్తువేల్‌ను ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమించినట్లు ఇస్రో ప్రకటించింది. అయితే పాలన వ్యవహారాల్లో భాగంగా ఎప్పటిలాగే కొత్త ప్రాజెక్టుకు కొత్త డైరెక్టర్‌ను నియమించినట్లు ఇస్రో స్పష్టం చేసింది.
చంద్రయాన్-2 ప్రయోగానికి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన వనిత కూడా అత్యంత ప్రతిభావంతురాలని ఇస్రో తెలిపింది. పీ. వీరముత్తువేల్ ప్రస్తుతం స్పేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్‌లో డిప్యూటీ డైరెక్ట్‌ర్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు ఇస్రో తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa