దివంగత టీడీపీ నేత పరిటాల రవి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పరిటాల శ్రీరాములయ్య సోదరుడు గజ్జిలప్ప తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. తమకు పెద్దదిక్కుగా ఉన్న గజ్జిలప్ప మృతితో పరిటాల కుటుంబీకులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ వార్త తెలుసుకున్న పరిటాల అభిమానులు, టీడీపీ నేతలు పెద్దఎత్తున ఆయన ఇంటికి వచ్చి తమ సంతాపాన్ని తెలియజేశారు. సోమవారం మధ్యాహ్నం పరిటాల గజ్జిలప్ప అంత్యక్రియలు జరుగుతాయని కుటంబసభ్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa