జార్ఖండ్ లో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. 81 స్థానాలున్న జార్ఖండ్ లో కాంగ్రెస్-జేఎంఎం కూటమి 45 స్థానాల్లో అధిక్యం కనబరుస్తోంది. మేజిక్ ఫిగర్ 41స్థానాలను దాటి కాంగ్రెస్ కూటమి అధిక్యంలో కొనసాగుతోంది. ఇక అధికార బీజేపీ కేవలం 25స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఇక ఏజేఎస్ యూ-4, జేవీఎం-3, ఇతరులు-4 స్థానాల్లో అధిక్యం కనబరుస్తున్నారు. పూర్తి స్థాయి ఫలితాలు మధ్యాహ్నాం వరకు రానున్నాయి. పౌరసత్వ చట్టంపై బీజేపీ అనుసరించే వైఖరే కాషాయ పార్టీ ఓటమి కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa