ఏపీ రాజధాని గురించి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ నెల 27న విశాఖలో కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాజధాని ప్రాంతం మందడం నుంచి సచివాలయానికి వెళ్లే రహదారి పక్కనే ఉన్న ఇళ్లకు నోటీసులు జారీ చేశారు. ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే తమకు చెప్పాలని ఆ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. మంత్రి మండలి భేటీ జరిగే రోజున ప్రజల నుంచి ఎటువంటి నిరసనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు , రాజధానిని మార్చాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై అమరావతి రైతులు మండిపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa