కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని వాజ్ పేయ్ జయంతిని పురస్కరించుకొని ‘అటల్ భూజల్ యోజన’ అనే పథకాన్ని ప్రారంభించింది. వాజ్ పేయ్ జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ … దేశంలో భూగర్భ జలాలను పెంపొందించి..సమర్థవంతంగా వినియోగించకోవడానికి ‘అటల్ భూజల్ యోజన’ అనే పథకాన్ని ఏడు రాష్ట్రాల్లో అమలు చేయబోతునట్లు ప్రకటించారు. ఈ పథకానికి కేంద్రం రూ. 6000 వేల కోట్లను కేటాయించింది. గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ పథకం అమలు కానుంది. దాదాపు 8350 గ్రామ పంచాయతీలకు లబ్ధి చేకూరనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa