ఇంజనీరింగ్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి..? ఎవరికి ముందు నిర్వహించాలి..? ప్రశ్నపత్రం ఎలా ఉండాలి..? పరీక్ష సమయం ఎంత ఉంటే బాగుంటుంది..? ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉండాలి..? ఇలా అనేక విషయాలపై జేఎన్‌టీయూ-హైదరాబాద్ పాలక మండలి నిర్ణయం తీసుకుంది.కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ నేపథ్యంలోవిద్యార్థులకు పరీక్షలు తాత్కాలికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఇంజినీరింగ్, ఇతర కోర్సుల పరీక్షలపై జేఎన్‌టీయూహెచ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి బీటెక్, బీఫార్మసీ చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్షల సమయం రెండు గంటలే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరంలో డిటెన్షన్ విధానం రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. విద్యార్థులు చదువుతున్న కళాశాలలోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు జేఎన్‌టీయూహెచ్ తెలిపింది. పరీక్షలకు హాజరుకాలేకపోతే.. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రాసే అవకాశమిస్తున్నట్లు పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa