ఆడది బయటికొస్తే కామంతో చూసే కొన్ని వేల కళ్ల మధ్య నుంచి నడవాలి సార్ అంటూ ఓ సినిమాలో హీరో చెప్పిన డైలాగ్ ప్రస్తుత సమాజంలో మహిళ దుస్థితిని తెలియజేస్తుంది. అయితే ఇంటి నుంచి బయటికి రాకపోయినా కామంతో చూసే కళ్లు ఆగేలా కనిపించడం లేదు. ఇంట్లోనూ మహిళలు స్వేచ్ఛగా ఉండలేని పరిస్థితి దాపురించిందా అన్న అనుమానం కలుగుతోంది. సరిగ్గా అలాంటి దారుణ ఘటనే ఒకటి తాజాగా వెలుగుచూసింది. అర్ధరాత్రి వేళ భర్తతో బెడ్రూమ్‌లో ఉన్న సమయంలో పక్కింటి వ్యక్తి రంధ్రంలో నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తున్న దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది.రాత్రివేళ భార్యాభర్తలు బెడ్రూమ్‌లో ఉండగా పక్కింటి రంధ్రంలో నుంచి చూస్తున్న ఘటన పూణె సమీపంలోని డెహు రోడ్ పరిధిలో జరిగింది. అర్ధరాత్రి సుమారు ఒకటిన్నర గంటల సమయంలో భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్న సమయంలో అలికిడి వినిపించడంతో చుట్టుపక్కల చూశారు. పక్కింటి వ్యక్తి రంధ్రంలో నుంచి ఏకాంతంగా ఉన్న ఇద్దరినీ చూస్తూ ఎంజాయ్ చేయడం చూడడం చూసి షాక్‌కి గురయ్యారు.
భర్త గట్టిగా అరవడంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భర్తతో బెడ్రూమ్‌లో ఉన్న సమయంలో బొక్క నుంచి తొంగిచూస్తున్నాడంటూ బాధితురాలు పక్కింటి వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏకాంతంగా ఉన్న సమయంలో తమను కెమెరాలో రికార్డు చేసి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. తమ వీడియోలు తీసి ఉంటాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa