ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దక్షిణ కర్ణాటక, రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 12:31 PM

దక్షిణ కర్ణాటక, రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు రానున్నాయి.  ఈనెల 10, 11 తేదీల్లో తెలంగాణ, కోస్తాంధ్రలకు నైరుతి విస్తరించనున్నాయి.  తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. చిత్తూరు, అనంతపురం మీదుగా ఏపీలోకి నైరుతి ప్రవేశించినది.  11 నాటికీ ఏపీలో అంతటా నైరుతి విస్తరించనుంది. తెలంగాణలో ఈ రోజు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.   ఈనెల 10, 11 నుంచి తెలంగాణలో వర్షాలు మొదలు కానున్నాయి.  నైరుతి ప్రభావంతో ఏపీలో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa