ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటవీ సిబ్బంది ఆలస్యం

national |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 12:54 PM

అసోంలోని గువాహటి శివారు ప్రాంతంలో ఓ చిరుతను స్థానికులు కొట్టి చంపేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో చిరుతను చంపేశారన్న విషయం అటవీశాఖ అధికారులకు తెలిసింది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన మిగతా వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. అటవీ శాఖ అధికారులు ఆ చిరుతను పట్టుకు నేందుకు బోను ఏర్పాటు చేసినప్పటికీ వారు ఈ ఘటనకు పాల్పడ్డారు. అధికారులు చిరుతను పట్టుకోవడంలో ఆలస్యం చేశారని, అందుకే దాని మీద భయంతో ఈ పని చేశామని గ్రామస్థులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa