చంద్రబాబు నిర్ణయాలతో ఏపీ చాలా నష్టపోయిందని ఎమ్మెల్యే కరణం బలరాం వ్యాఖ్యానించారు. వైసీపీ ఏడాది పాలనపై చంద్రబాబు విమర్శించినా.. ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఓటమికి టీడీపీ ఇప్పటికైనా సమీక్షించుకోవాలని అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో విలువలు లేవని ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధిపై మాత్రం దృష్టిపెడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వెలుగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రస్తుతం వెలుగొండ పనులు వేగంగా జరుగుతున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వైసీపీ ఏడాదిలోనే అమలు చేసిందని కరణం బలరాం అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa