ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉన్నా న్యాయం జరిగే పరిస్థితి లేదు : వర్ల రామయ్య...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 01:27 PM

వైజాగ్ దళిత డాక్టర్ సుధాకర్ వ్యవహారం తర్వాత... ఇప్పుడు మరో దళిత డాక్టర్ అనితారాణి అంశం కలకలం రేపుతోంది. దిగువ స్థాయి సిబ్బంది అవినీతి గురించి ప్రశ్నించినందుకు... వైకాపా నేతలను పిలిపించి, తనను  రకరకాలుగా వేధించారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బాత్రూమ్ లోకి వెళ్లినా తన ఫొటోలు, వీడియోలు తీశారని కంటతడి పెట్టారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉన్నా న్యాయం జరిగే పరిస్థితి లేదని అన్నారు. ఎవరికి చెప్పాలో అర్థం కాని స్థితిలో చివరకు హైకోర్టును ఆశ్రయించానని చెప్పారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ఉద్దేశిస్తూ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.


'నారాయణస్వామిగారూ, మీ నియోజకవర్గంలో ఉన్న పెనమలూరు వైద్యశాలలో దళిత డాక్టర్ అనితారాణిని మీ నాయకులు అసభ్యంగా, కులం పేరుతో తిడుతూ, మానసికంగా వేధిస్తుంటే... మీరు కానీ, పోలీసులు కానీ పట్టించుకోలేదు. తనను మరో డాక్టర్ సుధాకర్ ను చేస్తారేమోనని ఆమె భయపడుతున్నారు. కింకర్తవ్యం?' అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa