ఈఎస్ఐ స్కాములో అన్ని ఆధారాలతోనే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని తెలిపారు. అరెస్ట్ పై స్పీకర్ గా నాకు సమాచారం ఇచ్చారు. మందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఏసీబీ నిర్ధారించింది. వందలకోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారు. చంద్రబాబు ఆరోపణలు, విమర్శలపై స్పీకర్ కౌంటర్ ఇచ్చారు. అచ్చన్నాయుడు బీసీ ఐతే నేరాన్ని వదిలేద్దామా ని అయన ప్రశ్నించారు. ఇది బిసిలందరికి చంద్రబాబు ఆపాదించడం చాల బాధాకరం అని అయన అన్నారు. చంద్రబాబు ఈ నేరాన్ని బిసిలు అని బిసిలను అవమానిస్తున్నారు. క్రైం జరిగినప్పుడు బీసీ, ఎస్టి, ఓసి అని చర్చ కాదు అని అయన అన్నారు. నేరం ఎవరికైనా నేరమే అని అయన అన్నారు. నేరాలకు బిసిలకు లింకులు పెడుతూ రాజకీయాలు చేస్తున్నారు. ఒకవేళ అచ్చెన్నాయుడు నేరం చేయలేదు అనుకుంటే రుజువు చేసుకోండి. అక్రమ సంపాదనను మనీ లాండరింగ్ ద్వారా దరి మళ్లించారు. అచ్చెన్నాయుడు ఉగ్రవాది, బందిపోటు అని మేము ఎవరమూ అనలేదే అని అయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa