లాక్ డౌన్ సడలింపుల వల్ల ఏపీలో బస్సులు తిరగడానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో బస్సులు రోడ్డెక్కాయి. అయితే అంతర్రాష్ట్ర సర్వీసులకు మాత్రం అనుమతి లభించలేదు. దీంతో ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సులు వెళ్లడంలేదు. ఈ క్రమంలో ఈ నెల 17 నుంచి కర్ణాటకకు బస్సులు తిప్పాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. మొదట పరిమిత సంఖ్యలోనే బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. బెంగళూరు సహా కర్ణాటకలోని పలు ప్రాంతాలకు 168 బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆపై 4 దశల్లో బస్సు సర్వీసుల సంఖ్యను 500కి పెంచాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు రేపటి నుంచి ఆన్ లైన్ రిజర్వేషన్లు ప్రారంభించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa