ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఎమ్మెల్సీ స్థానం భర్తీకి షెడ్యూల్‌ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 15, 2020, 06:27 PM

ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానం భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ సోమవారం షెడ్యూల్‌ విడుదల విడుదల చేసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 18న వెలువడనుంది. జులై 6న పోలింగ్‌ నిర్వహిస్తారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు ఉందని, 26న నామినేషన్లను పరిశీలన, 29 వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంది. శాసనసభ్యుల కోటాలో ఈ ఎమ్మెల్సీ స్థానం భర్తీ కానుంది. జులై 6న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాన్ని ప్రకటించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa