ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పీకర్ తమ్మినేని అధ్యక్షతన బిజినెస్ అడ్వయిజరీ కౌన్సిల్ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 16, 2020, 12:52 PM

స్పీకర్ తమ్మినేని అధ్యక్షతన బిజినెస్ అడ్వయిజరీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం జగన్, మంత్రులు బుగ్గన , కన్నబాబు, చీఫ్ విప్ శ్రీకాంత్ హాజరయ్యారు. టీడీపీ తరపున  బిజినెస్ అడ్వయిజరీ కౌన్సిల్ సమావేశానికి రామానాయుడు హాజరైయ్యారు. సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై  బిజినెస్ అడ్వయిజరీ కౌన్సిల్ లో నిర్ణయం తీసుకోనున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో బీఏసీ సమావేశాలకు టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడు హాజరైయ్యారు.  ఈ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa