మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆయన సోదరుడు మీజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సీఎం జగన్ పై సంచలన వాఖ్యలు చేశారు. జగన్ బెదిరింపులకు తాను భయపడనని, ఆయనకు లొంగబోనన్నారు. అవసరం అయితే వ్యవసాయం చేస్తానన్నారు. ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనాలన్నది సీఎం జగన్ ఆలోచన అని జేసీ దివాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అభివృద్ధి గురించి సీఎంకు అసలు ఆలోచనే లేదన్నారు. తన వ్యాపారాలను దెబ్బతీయడమే లక్ష్యంగా తన లారీలు, బస్సులను ఆపేశారని జేసీ ధ్వజమెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa