ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాతో ఉద్రిక్తతపై రాహుల్ గాంధీ ట్వీట్

national |  Suryaa Desk  | Published : Fri, Jun 19, 2020, 01:00 PM

తూర్పు లడఖ్‌లో భారత్‌-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ ట్విట్టర్ లో  పలు వ్యాఖ్యలు చేశారు. 'ఈ కింది విషయాలు ఇప్పుడు స్ఫష్టమయ్యాయని ట్వీట్ చేశారు. అందులో  1. గాల్వన్‌లో చైనా చేసిన దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని,  2. భారత ప్రభుత్వం  ఈ సమస్యను పట్టించుకోకుండా మొద్దు నిద్రపోయిందని,  3. దీంతో మన వీర జవాన్లు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ చేసిన వ్యాఖ్యలను కూడా  ఆయన పోస్ట్ చేశారు. చైనా ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ దాడి జరిగిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారని,  ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని, తాము రాజీపడబోమని ఆయన అన్నారు. మన భూభాగాన్ని ఆక్రమించుకునే అవకాశాన్ని తాము ఇవ్వబోమని చెప్పారు. అయన చేసిన వ్యాఖ్యలను రాహుల్ ట్విట్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa