రాష్ట్రవ్యాప్తంగా పలు లిక్కర్ దుకాణాల సైసెన్సులు రద్దు అంశంలో అవినీతికి పాల్పడ్డారంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. బెంగళూరుకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లపై అవినీతి నిరోధకశాఖకి ఫిర్యాదు చేశారు. రవికృష్ణారెడ్డి అనే అవినీతి వ్యతిరేక ఉద్యమ సంస్థ కార్యకర్త చేసిన ఈ ఫిర్యాదులో హైవేలపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టు హైవేల సమీపంలో లిక్కర్‌షాప్‌లను రద్దుచేస్తూ ఇచ్చిన తీర్పును నేపథ్యంలో ప్రజల్లో అయోమయం సృష్టించి అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ అంశంపై ఏసీబీ సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులను ప్రశ్నించాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa