హంబన్‌తోట: జింబాబ్వే క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. శ్రీలంకపై వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్నది జింబాబ్వే. ఇవాళ హంబన్‌తోటలో జరిగిన అయిదవ వన్డేలో జింబాబ్వే స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. దీంతో వన్డే సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకున్నది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 203 రన్స్ చేసింది. ఆ తర్వాత చేజింగ్‌కు దిగిన జింబాబ్వే 37.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకున్నది. 2009 తర్వాత మొదటిసారి జింబాబ్వే వన్డే సిరీస్‌ను గెలుచుకున్నది. చివర్లో సికందర్ రాజా కీలక ఇన్నింగ్స్ ఆడటంతో జింబాబ్వేకు విక్టరీ సొంతమైంది. ఈ మ్యాచ్‌లో లంక బౌలర్ దనంజయ ఆరు వికెట్లు తీసుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa