తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. గోవిందుడి దర్శనానికి భక్తులు 22 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. నడకమార్గం ద్వారా వచ్చిన భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. నడకమార్గం ద్వారా వచ్చిన భక్తులకు శుక్ర, శని, ఆది వారాల్లో దివ్యదర్శనం టోకెట్లు ఇవ్వడం జులై 7 తేదీ నుంచి నిలిపివేశారు. లడ్డూల టోకెన్లు మాత్రం ఇస్తున్నారు. సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో నడక మార్గంలో వచ్చిన భక్తులకు దివ్యదర్శనం టోకెట్లు, లడ్డూ టోకెట్లు జారీ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa