విజయవాడ: ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇవాళ పలు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ పర్యటన రద్దైంది. కంటి ఇన్‌ఫెక్షన్ కారణంగా ఎస్‌ఈసీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించడానికి ఇవాళ కడప, అనంతపురం, కర్నూలులో పర్యటించాలని ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa