దేశం లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ. ఇంటర్ పరీక్షలను కూడా వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం మాత్రం ఒకటి నుంచి 9వ తరగతి వరకు సెలవులను ప్రకటిస్తూ. పరీక్షలను మాత్రం యథాతథంగా కొనసాగిస్తామని ప్రకటించింది. ఈ విషయం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ పై మండిపడ్డారు. మీ నిర్ణయం వల్ల 16.5 లక్షల మంది విద్యార్థులు కాకుండా వారి కుటుంబాలు కూడా ఇబ్బందుల్లో పడతారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని ఆరోపించారు. పదో తరగతి పరీక్షలను, ఇంటర్ పరీక్షలను కూడా రద్దు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa