నెల్లూరు జిల్లాలో మానవత్వం మంటగలిసిన సంఘటన చోటు చేసుకుంది. నవాబ్‌పేట్‌లోని ఓ అపార్టుమెంట్‌లో కుటుంబసభ్యులకు కరోనా సోకింది. అయితే ఆ కుటుంబ సభ్యులను బయటకు రానివ్వకుండా అపార్టుమెంట్ వాసులు తాళం వేశారు. కరోనా తమకు కూడా సోకుతుందనే కారణంగా అపార్టుమెంట్ వాసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బలవంతంగా ఇంట్లో పెట్టి తాళం వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa