విజయవాడ: నగంలోని షాపులు ఎన్ని గంటలకు మూయాలి, ఎన్ని గంటలకు తెరవాలి అని ఒక స్పష్టత లేదని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ప్రభుత్వమే ముందుకొచ్చి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆ సమయాలను ఖచ్చితంగా అమలు చెయ్యాలని అన్నారు. మరోవైపు షాపులపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మద్యం షాపులకు, బార్లకు వర్తిస్తాయా?..లేదా? అన్నది కూడా స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు. ప్రభుత్వం తడబడకుండా నిర్ణయాలు తీసుకోవాలని వర్ల రామయ్య హితవుపలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa