కరోనాకు గురై హాస్పిటల్‌లో చేరిన ఓ వ్యక్తి అక్కడే సీఏ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. ఒడిశాలోని ఓ హస్పిటల్‌లో తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాస్క్, కళ్లద్దాలు పెట్టుకుని హస్పిటల్ బెడ్ పైనే చదువుకుంటున్న అతని ఫొటోను ఐఏఎస్ అధికారి విజయ్ కులంగే సోషల్ మీడియాలో షేర్ చేశారు. బెర్హామ్‌పూర్‌లోని ఎమ్‌కేసీజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తనిఖీకి వెళ్లినపుడు ఈ వ్యక్తి కనిపించాడని విజయ్ తెలిపారు. అతని ఫొటోను పోస్ట్ చేస్తూ.. `విజయం అనేది యాదృశ్చికం కాదు. ఎంతో అంకితభావం కావాలి. నీ అంకిత భావం నీ బాధను మరిపింపచేస్తుంది. విజయాన్ని దరిచేస్తుంద`ని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa