పొరుగు రాష్ట్రాలు విధించిన నిబంధనలను ప్రజలు అర్థం చేసుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని డిజిపి గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఇ-పాస్ లేకుండా ప్రయాణించడం ద్వారా రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ మేరకు డిజిపి కార్యాలయం నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇతర రాష్ట్రాల నుంచి ఎపికి రావాలనుకుంటే...
రాష్ట్రంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. ఆయా సమయాల్లో రాష్ట్రానికి రావాలనుకునేవారు, తమ గమ్యస్థానం ప్రకటించిన సమయంలో చేరుకునే పక్షంలో ఇ-పాస్ అవసరం లేదు. గమ్యస్థానం చేరుకోవడం ఆలస్యమయ్యేవారు తప్పనిసరిగా ఇ-పాస్ తీసుకోవాలి. ప్రభుత్వం పేర్కొన్న అత్యవసర, అంబులెన్స్ సేవలు, సంబంధిత సిబ్బందికి ఎలాంటి ఇ-పాస్ అవసరం లేదు. రాష్ట్రంలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించాలంటే...
రాష్ట్రంలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు ఇ-పాస్ లేకుండా ప్రయాణించొచ్చు. మిగతా సమయాల్లో ప్రయాణించేవారు మాత్రం ఇ-పాస్ తీసుకోవాలి. తప్పనిరిగా పూర్తి ధ్రువపత్రాలతో ఇ-పాస్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇ-పాస్ ను క్రింది లింక్ ద్వారా పొందవచ్చు.
కర్ఫ్యూ సమయంలో ప్రయాణానికి తప్పనిసరిగా సిటిజన్ సర్వీస్ పోర్టల్ (http//appolice.gov.in) ట్విట్టర్ (@ ap police100), ఫేస్‌్‌బుక్ ద్వారా @andhra pradeshstate police) ద్వారా పొందొచ్చు.
ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునేవారు తెలంగాణలోకి వెళ్లాలనుకునే వారు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూ ఉండదు, మిగిలిన సమయాల్లో అమల్లో ఉంటుంది. కర్ఫ్యూ ఉన్నా... లేకపోయినా ఇ-పాస్ తప్పనిసరి. http//police portal.tspolice.tnega.org ద్వారా ఇ-పాస్ పొందిన తర్వానే తెలంగాణలో ప్రయాణించాల్సి ఉంటుంది. తమిళనాడులో కూడా కర్ఫ్యూ అమల్లో ఉంది. వెళ్లాలనుకునే వారు http//e register.gov.in ద్వారా పొందొచ్చు. కర్నాటక రాష్ట్రంలో ఇ-పాస్ ఇంకా ఏర్పాటు కాలేదు. మన రాష్ట్రంలో ఏర్పాటుచేసిన లింక్ ద్వారా కర్ణాటక ప్రభుత్వం అవసరాన్ని బట్టి అనుమతినిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa