ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలో ఉన్న ఆర్ఆర్ వెంకటాపురం సబ్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం తెల్లవారుజామున సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకున్నది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa