వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. జిల్లాలోని ప్యాపిలి మండలం బావిపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనులు కల్పించే విషయంలో తలెత్తిన గొడవ ఘర్షణకు దారి తీసింది. వైసీపీ వర్గీయులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని 20 మందిపై కేసులు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa