జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై సంచలన ట్వీట్ చేశారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని ఇవ్వాలన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం లేదని ఆరోపించారు. గత రెండేళ్లుగా ఈ భృతిని ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఆయన విమర్శించారు. స్వామి వివేకానంద ఆశయాలకు అనుగుణంగా యువత లక్ష్య సాధన దిశగా పనిచేయాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించడానికి వివేకానంద స్ఫూర్తితో కృషి చేయాలని జగన్ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa