ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ, విక్రయాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి జోగి రమేశ్ సోదరులతో పాటు ఇతర నిందితుల రిమాండ్‌ను విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించింది. సోమవారం రిమాండ్ గడువు ముగియడంతో నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, విచారణ కొనసాగుతున్న దృష్ట్యా రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa