ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోహిత్ శర్మ పై కోహ్లి వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 25, 2021, 12:00 PM

టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్  ఓడిపోయింది . మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో విరాట్ కోహ్లి.. రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తర్వాతి మ్యాచ్‌లో రోహిత్‌ను పక్కన పెట్టి.. ఇషాన్ కిషన్‌ను తీసుకుంటారా అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కోహ్లి నవ్వుతూ సమాధానమిచ్చాడు.' ఇది ధైర్యమైన ప్రశ్న. ఏమనుకుంటున్నారు.. సార్..! నాకు బెస్ట్ అనిపించిన టీమ్‌ను ఆడించాను. మీ అభిప్రాయం ఏంటి? రోహిత్ శర్మను మీరు ఓ అందర్జాతీయ టీ20 మ్యాచ్ నుంచి తప్పిస్తారా? నమ్మశక్యం కాదు. మీకు వివాదం కావాలంటే ముందే చెప్పండి. అందుకు తగినట్టే నేను సమాధానమిస్తాను` అని కోహ్లి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa