ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకినాడ మేయర్‌గా సుంకర శివప్రసన్న ఎన్నిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 25, 2021, 12:40 PM

కాకినాడ మేయర్‌గా సుంకర శివప్రసన్న, డిప్యూటీ మేయర్‌గా మీసాల ఉదయ్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్‌ ఎన్నికకు టీడీపీ కార్పొరేటర్లు హాజరుకాలేదు. ఇప్పటి వరకూ మేయర్‌గా ఉన్న సుంకర పావనిపై మెజార్టీ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో.. ఆమెను తొలగిస్తూ ప్రభుత్వం ఈ నెల 12న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఈ రోజు ఉదయం ఎన్నికలు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa