ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శశకళ ఆశలపై నీళ్లు చల్లిన సుప్రీంకోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 24, 2017, 08:28 AM

అన్నాడీఎంకే నేత శశికళ ఆశలపై సుప్రీం కోర్టు నీళ్లుచల్లింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఆమె శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ఆమె, ఆమె అక్కకుమారుడు సుధాకరన్, ఆమె వదిన ఇళవరసి రివ్యూ పిటిషన్‌ ను సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో శశికళకు ఊహించని దెబ్బతగిలింది. జైలు అధికారులకు 2 కోట్ల రూపాయల లంచం ఇచ్చి జైలులో సర్వసౌఖ్యాలు పొందుతున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు తమిళ నాట భారీ ఖర్చుతో ఆమె చేసిన రిసార్టు రాజకీయాలు వేగంగా మారుతూ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించేంత వరకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో శశికళకు ఈ తీర్పు శరాఘాతంలా పరిణమించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa