న్యూఢిల్లీ: గోవాలోని పనజీ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ కైవసం అయింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఈ నియోజకవర్గం నుంచి 4,803 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికలను మనోహర్ పారికర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నప్పటికీ అంతిమ విజయం మనోహర్ పారికర్‌కే దక్కింది.
కేంద్ర రక్షణ మంత్రిగా పనిచేసిన మనోహర్ పారికర్ ఆ పదవికి రాజీనామా చేసి గత మార్చిలో గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పారికర్ సీఎం పదవి చేపట్టేనాటికి ఆయన శాసనసభ్యుడు కాకపోవడంతో నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఆయన అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పనాజీ నుంచి అసెంబ్లీకి పోటీచేసి విజయం సాధించారు. కాగా, గోవాలోని వాల్పోయ్ నియోజకవర్గంలోనూ జరుగుతున్న ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa