కీటకాలను చైనా, థాయిలాండ్ వంటి దేశాలు ఎప్పటినుంచో తమ ఆహారంగా తీసుకుంటున్నాయి. మన దేశంలో కూడా కొన్ని ఆదివాసీ తెగలు చీమలు వంటి కీటకాలను ఆహారంగా తింటారు. 2023వ సంవత్సరం చివరి నాటికి తినదగిన కీటకాల ప్రపంచ మార్కెట్ 2 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని అంచనా. అయితే ఇప్పటికే అనేక దేశాల్లో పురుగులతో వంటకాలు చేసే స్టార్ హోటల్స్ , ప్రత్యేక ఫుడ్ వింగ్స్ ఏర్పడుతున్నాయి. ఆ పురుగులను ఎంతో ఇష్టంగా తింటూ తమ ఫుడ్ మెనూలో ఓ ప్రధాన వంటకంగా చేర్చేశారు కూడా. అయితే ఇప్పుడు బొద్దింకలు నుంచి బీరుని తయారు చేస్తున్నారు. ఈ బీరుని తాగడం కోసం జనం ఓ రేంజ్ లో ఆసక్తిని చూపిస్తున్నారు. తాజాగా జపాన్‌లో బొద్దింకల బీర్ పై అక్కడి ప్రజలు మోజుపడుతున్నారు. జపాన్ ప్రజలు తైవానీ బగ్‌తో తయారు చేసిన బీర్‌ను ఎంతో ఉత్సాహంతో తాగుతున్నారు. ఈ బీరు కొంచెం పులుపుగా ఉండి ఎంతో రుచిగా ఉంటుందంటూ లొట్టలేసుకుంటూ మరీ బాటిల్స్ కు బాటిల్స్ తాగేస్తున్నారు. దీంతో ఇప్పుడు అక్క్కడ బొద్దింకలతో తయారు చేసిన ఈ బీర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa