ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో నివసిస్తున్న ఓ యువతిపై బలియాలో బీజేపీ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వింగ్ జనరల్ సెక్రటరీగా ఉన్న రంజిత్ మౌర్య గురువారం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ యువతిపై అత్యాచారం చేసి అనంతరం బెదిరింపులకు పాలపడ్డాడు. అనంతరం విషయం బయటకు వెళ్లకుండా ప్రయత్నాలు చేశాడు. సదరు యువతిని బీజేపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిని చేస్తానని ఆశా చూపించాడు. అయినా సరే ఆ యువతి వినకపోవడంతో ఆమెను బెదిరించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa