కర్నూలు జిల్లాలోని గడివేముల మండలంలోని చిందుకూరు గ్రామానికి చెందిన చక్రధర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేసి, యువతిని వేధిస్తున్నాడని చక్రధర్‌పై కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... అదే గ్రామానికి చెందిన ఓ యువతితో చక్రధర్ సన్నిహితంగా మెలుగుతూ.. ప్రేమిస్తున్నట్లు నటిస్తూ ఫొటోలు తీసుకున్నాడని, వాటిని చూపిస్తూ పెళ్లి సంబంధాలు చెడగొట్టే వాడన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే చంపుతానని చక్రధర్ బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa