జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో గురువారం తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతం అయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కుల్గాం జిల్లాలోని రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గురువారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో సెర్చ్ ఆపరేషన్ టీమ్‌పై షూటర్లు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తం అయిన బృందాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మృతి చెందారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. వీరు ఏ సంస్థకు చెందిన వారు అన్న విషయం ఇంకా తెలియరాలేదని..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa