భారత్‌లో 18ఏళ్లలోపు అమ్మాయిలకు పెళ్లి చేయకూడదని చట్టాలు చెబుతున్నాయి. అయితే ఈ వివాహ కనీస వయసును పెంచే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై లోతుగా అధ్యయనం చేసేందుకు సమతా పార్టీ మాజీ ఛైర్మన్ జయా జైట్లీ నేతృత్వంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది. ఈ నేపపద్యంలో తాజాగా అమ్మాయిల వివాహ వయస్సు పెంపు పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో అమ్మాయిల వివాహ వయస్సు 18 సం లుగా ఉండేది, ఇపుడు కేంద్రం అమ్మాయిల వివాహ వయస్సు ను 21 సం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa